Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
ఆ అడవిబిడ్డ ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కలలుగన్నది. తమ జాతి తరాల తలరాతను మార్చాలని ఆశయం పెట్టుకొన్నది. కుటుంబ సభ్యులు, పెద్దల సహకారం కూడగట్టుకున్నది.
- కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
- కళాశాల చదువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన బాలిక
- ఆర్డీటీ ఆర్థిక తోడ్పాటుతో ఓ కార్పొరేట్ కాలేజీలో చేరిక
- సంస్థ పరిధిలో లేని ఫీజులతో యాజమాన్యం వేధింపులు
- 6వేల బకాయి పేరుతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
- వృథా అయిన ఆ అభాగ్యురాలి విద్యా సంవత్సరం
- దికుతోచని స్థితిలో అడవిబాట పట్టిన అక్షర దీపం
- చెంచుపెంటకు వెళ్లి చీపురుపుల్లల సేకరణలో నిమగ్నం
హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ఆ అడవిబిడ్డ ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కలలుగన్నది. తమ జాతి తరాల తలరాతను మార్చాలని ఆశయం పెట్టుకొన్నది. కుటుంబ సభ్యులు, పెద్దల సహకారం కూడగట్టుకున్నది. ఆర్డీటీ ఆర్థికసాయం తోడయింది. తన కలల సాధన కోసం హైదరాబాద్ నగరబాట పట్టింది. కానీ, కార్పొరేట్ కళాశాల యాజమాన్యం నిర్వాకం ఆమె కలలను కల్లలు చేసింది. కొద్దిపాటి ఫీజు బకాయి పేరుతో ఆమెకు ఇంటర్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. నిస్సహాయురాలైన ఆ చెంచు బాలిక చేసేదేమీలేక కళాశాల మెట్లు దిగింది.
ఉన్నత విద్యాభ్యాసం చేయాల్సిన ఆ ఆడబిడ్డ.. అడవిబాట పట్టి తన సొంత గూడేనికి చేరుకొని నిట్టూరుస్తున్నది. ఫీజు బకాయిల పాపం.. ఆ చెంచు బాలిక చదువుకు చెక్ పడింది. సకాలంలో సర్టిఫికెట్లు అందక అడ్మిషన్ల గడువు ముగిసిపోవడంతో విలువైన ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వృథా అయింది. వివరాలిలా ఉన్నాయి. నల్లమల అడవులను దాటి, ఉన్నత చదువులతో తన జీవితాన్ని మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో చెంచు వెన్నెల (పేరు మార్చాము) చెంచు జాతి చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ నగరానికి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఒక చెంచుపెంటకు చెందిన ఆ బాలిక గ్రామీణాభివృద్ధి సంస్థ ఆర్డీటీ అందించిన ఆర్థిక తోడ్పాటుతో పీర్జాదిగూడలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరింది.
హిడెన్ చార్జీలతో తొలి నుంచీ వేధింపులు
ఆ బాలిక చదువు కోసం ఆర్డీటీ సంస్థ పూర్తిస్థాయి ఫీజులను కళాశాలలో చెల్లించింది. అయితే ఆ సంస్థ పరిధిలోకి రాని పలు హిడెన్ చార్జీలను సృష్టించిన యాజమాన్యం మొదటి నుంచీ ఆ బాలిక పట్ల వేధింపులకు దిగింది. ప్రథమ సంవత్సరంలోనూ చెంచు వెన్నెలను రూ.8,000 అదనపు ఫీజు కోసం నిర్వాహకులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఆ మొత్తం చెల్లించలేదని పరీక్ష ఫీజు కట్టించుకోవడానికి కూడా నిరాకరించారు. ఆ సమయంలో బాలిక సోదరుడు స్థానికుల ద్వారా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన హరీశ్‌రావు.. కళాశాలకు చెల్లించాల్సిన రూ.8,000 ఫీజుతోపాటు బాలిక వ్యక్తిగత ఖర్చుల కోసం ఆర్థికసాయం అందించి పరీక్ష రాయడానికి ఆనాడు అండగా నిలిచారు.
రూ.6,000 కోసం సర్టిఫికెట్ల నిరాకరణ
విద్యార్థిని చెంచు వెన్నెల తన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువును విజయవంతంగా పూర్తి చేసుకొన్న తర్వాత, ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కళాశాలను ఆశ్రయించింది. ఈ సమయంలోనే యాజమాన్యం కనికరం లేకుండా ప్రవర్తించింది. ఫీజు మొత్తం ఆర్డీటీ చెల్లించగా, హిడెన్ ఫీజుల కింద ఇంకా రూ.6,000 బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు తిరసరించింది. బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ.. ఆ అడవి బిడ్డ పడుతున్న ఆవేదనను, పైచదువుల ప్రాధాన్యాన్ని ఆ కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదు.
మళ్లీ అడవిబాట పట్టిన అక్షర దీపం
కళాశాల నిర్లక్ష్య వైఖరితో వెన్నెలకు సర్టిఫికెట్లు చేతికందలేదు. ఈలోగా డిగ్రీ ప్రవేశాల గడువు ముగిసిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఏం చేయాలో పాలుపోక తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని కన్నీళ్లతో ఉత్త చేతులతోనే తిరిగి తన చెంచు పెంటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి అడవిలో చీపురు పుల్లలు, అటవీ ఫలసాయం సేకరిస్తూ జీవనం సాగిస్తున్నది. నిరుపేద ఆదివాసీ విద్యార్థిని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ప్రైవేట్ కళాశాల ధనదాహంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. తక్షణమే సంబంధిత అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆ వి ద్యార్థినికి సర్టిఫికెట్లు ఇప్పించి పైచదువులకు అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులతోపాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్షర వెలుగును వెతుకుంటూ న గరానికి వచ్చిన ఆ చెంచు ఆడబిడ్డకు అండగా నిలువాలని కోరుతున్నారు. రూ. 6,000 బకాయి ఉన్నదన్న నెపంతో యా జమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో, ఉ న్నత విద్యనభ్యసించాలన్న ఆ విద్యార్థిని కల
లు ‘అడవి కాచిన వెన్నెల’లా మిగిలాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

