కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలని చూస్తున్న అధికార కాంగ్రెస్‌పార్టీకి ఆదిలోనే రాజకీయ సంకటం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన మిత్రపక్షాలను పకనబెట్టి, ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేయడంపై ఆయా పార్టీల నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.
- ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో సీపీఎం, టీజేఎస్
- కాంగ్రెస్‌కు మద్దతుపై 3 రోజుల్లో నిర్ణయించనున్న సీపీఐ
- వామపక్షాల మద్దతు కోరిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలని చూస్తున్న అధికార కాంగ్రెస్‌పార్టీకి ఆదిలోనే రాజకీయ సంకటం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన మిత్రపక్షాలను పకనబెట్టి, ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేయడంపై ఆయా పార్టీల నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఉద్యమాలకు, ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలకు మంచిపట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల స్థానంపై ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరించడంపై టీజేఎస్‌తోపాటు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సీపీఐ, సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి అధికార పీఠాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించిన తమను కనీసం సంప్రదించకుండా పకన పెట్టడాన్ని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ పార్టీకి తమ రాజకీయ బలాన్ని రుచి చూపించేందుకు టీజేఎస్ , సీపీఐ, సీపీఎం సంయుక్తంగా అభ్యర్థిని బరిలోకి దించే దిశగా పావులు కదుపుతున్నాయి. ఈ ఐక్య వేదిక రూపుదిద్దుకుంటే, అది కచ్చితంగా హస్తం పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ఓట్లకు పెద్ద గండి
ప్రతిపక్ష బీఆర్ఎస్, జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఈ పట్టభద్రుల స్థానంలో గట్టి పోటీని ఇవ్వనున్నాయి. ఈ బహుముఖ పోటీలో తన మిత్రపక్షాల తోడు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం అంటే.. ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజ్ ఇవ్వడమే అవుతుందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు ద్వితీయ ప్రాధాన్య ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహం రచిస్తున్నాయి. గాంధీభవన్‌లో ఇప్పటికే ఈ పరిణామంపై అత్యవసర అంతర్గత చర్చలను పార్టీ పెద్దలు మొదలుపెట్టారు. పరిస్థితి చేయిదాటిపోక ముందే ప్రొఫెసర్ కోదండరామ్‌తోపాటు సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో చర్చలు జరిపి, రాజీ ఫార్ములాను కుదర్చాలని కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తన పెద్దరికాన్ని ప్రదర్శించి అసంతృప్త మిత్రులను ప్రసన్నం చేసుకోకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
సీపీఎం, టీజేఎస్ ససేమిరా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విషయంలో సీపీఎం, టీజేఎస్ ససేమిరా అంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో సీపీఎం అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచినందున.. ఈ దఫా టీజేఎస్, ఇతర వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే విజయం సాధించగలమనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోసారి టీజేఎస్, ఇతర వామపక్షాలతో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో సీపీఎం ఉందని, రాష్ట్ర కమిటీలో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు.
సీపీఐ సానుకూలం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సీపీఎం, సీపీఐ నేతలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవితో కలిసి శుక్రవారం ఆయన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, సాగర్ ఇతర నేతలను కలిసి మద్దతు కోరారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం నుంచి జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జాతీయ కార్యదర్శి డీ రాజా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తకళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

