బైకుపై వచ్చి పుస్తెలతాడు అపహరణ

మెదక్ : బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ పుస్తెలతాడును అపహరించుకు పోయిన సంఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మటం అనిత అనే మహిళ తన వ్యవసాయ పొలం పనులను ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నది. ఈ క్రమంలో వెనుక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వచ్చి దారి అడిగి నట్లుగా నటిస్తూ.. మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చేగుంట ఎస్ఐ సభాష్గౌడ్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- abduct
- bike
- pusthelathadu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

