25 ఏండ్ల తర్వాత బీజేపీ ఉండదు!
రాష్ట్రంలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏండ్ల కిందట బీజేపీ లేదని, మరో 25 ఏండ్ల తర్వాత ఆ పార్టీ ఉనికిలో ఉండదని వ్యాఖ్యానించారు.
- భారత్ సమ్మిట్‌కు కేంద్రం ఆటంకాలు
- బీజేపీ దృష్టంతా గుజరాత్ మీదే.. ఇతర రాష్ట్రాలపై వివక్ష: సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏండ్ల కిందట బీజేపీ లేదని, మరో 25 ఏండ్ల తర్వాత ఆ పార్టీ ఉనికిలో ఉండదని వ్యాఖ్యానించారు. సీఎం శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌ను బీజేపీ రాజకీయ దృష్టితో గుడ్డిగా వ్యతిరేకిస్తున్నదని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు.
వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అవకాశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో ఈ సమ్మిట్‌లో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఉన్న అనుకూల పరిస్థితులు, హైదరాబాద్‌లోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరుకావాల్సి ఉన్నదని చెప్పారు. అయితే కొందరు ప్రతినిధులను చివరి నిమిషంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీసాలను రద్దు చేయడంతో కొందరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భారత్ సమ్మిట్‌తో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత రామచందర్‌రావుకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు.
గుజరాత్‌కే అధిక ప్రాధాన్యం
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇతర రాష్ర్టాలకు గిఫ్ట్ సిటీ తరహా మౌలిక సదుపాయాలు కల్పించడంలో వివక్ష చూపుతున్నదని విమర్శించారు. అన్ని రాష్ర్టాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండాలని, ఒక రాష్ర్టానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా రాష్ర్టాలను నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిందిపోయి రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించడమంటే భారతదేశాన్ని వ్యతిరేకించడం కాదని స్పష్టంచేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించవద్దని హితవు పలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

