న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం

హైదరాబాద్ : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్), హైదరాబాద్‌కు 2020-21 ఏడాదిగాను నిర్మాణ నైపుణ్య అభివృద్ధి అచీవ్మెంట్ అవార్డు లభించింది. 12వ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్(సీఐడీసీ) అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని లోధిరోడ్‌లో గల ఇండియా హాబిటాట్ సెంటర్, స్టెయిన్ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, పీ అండ్ ఆర్ ఐ.శాంతి, డైరెక్టర్, పీజీ కోర్సెస్ కె. రాధాకృష్ణ పురస్కరాన్ని అందుకోవడం జరిగింది. సీఐడీసీ విశ్వకర్మ అవార్డులు భారతదేశ నిర్మాణ పద్ధతుల దేవుడు అయిన విశ్వకర్మ చేత పోషించబడిన నిర్మాణ సృష్టి స్ఫూర్తితో ప్రేరణ పొందాయి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మార్చిలో సీఐడీసీ నిర్వహిస్తుంది.
మెరుగైన ఉత్పాదనలు, ప్రక్రియలను అందించడం, దేశ నిర్మాణానికి సహాయపడటానికి, పరిశ్రమకు అధిక ప్రమాణాలను సృష్టించడం కోసం సంస్థలు గుర్తించబడతాయి. ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం అందుకోవడంపై డీజీ, న్యాక్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్యోగులను అభినందించారు. 13 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా చేసిన ఉత్తమ కృషికి ఎన్ఏసీ ఈ అవార్డును అందుకుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

