Chiranjeevi | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుస్మిత సరదాగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “మన శంకర వరప్రసాద్ గారు (చిరంజీవి)కి అమ్మ (సురేఖ) అంటే కాస్త భయం ఉంటుంది. దానికి తాజాగా షూటింగ్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఉదాహరణ,” అని అన్నారు. ఇటీవల నాన్న ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. అప్పుడు అమ్మ అనుకోకుండా సెట్స్‌కి వచ్చారు. ఆమె వచ్చి ఎదురుగా కూర్చోవడంతో నాన్న స్టెప్పులు కొంచెం శృతి తప్పాయి, డ్యాన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. అమ్మ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు అని నవ్వుతూ చెప్పారు.
సుస్మిత చెప్పిన ఈ సంఘటన విన్న అభిమానులు నవ్వులు తెగ నవ్వేశారు. ‘‘ఎంత మెగాస్టార్ అయినా భార్యకి భయపడాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఇక చిరంజీవి ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. నయనతార ఇందులో కథానాయికగా నటిస్తుంది. వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిరు నటించిన విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకి మాత్రం మంచి థ్రిల్ ఇస్తుందని అంటున్నారు. ఈ మూవీ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.