అహ్మదాబాద్: ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సురేంద్రనగర్ జిల్లాలోని గజన్వవ్ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో తాసిల్దార్, డిజాస్టర్ మెనేజ్మెంట్ బృందం గ్రామానికి చేరుకున్నారు. బాలిక ప్రస్తుతం 60 ఫీట్ల లోతులో ఉన్నదని తెలిపారు. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువస్తామని చెప్పారు.