Chicken Price | చికెన్ ధరలకు రెక్కలు.. కొండెక్కిన కోడిగుడ్డు..!
Chicken Price | ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్ (Chicken), కోడిగుడ్లు (Eggs) ఇప్పుడు భారంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్, కోడిగుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లోనే గుడ్లు, కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్‌వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chicken Price : ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్ (Chicken), కోడిగుడ్లు (Eggs) ఇప్పుడు భారంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్, కోడిగుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లోనే గుడ్లు, కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్‌వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మధ్య విక్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. విజయవాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా కిలో చికెన్ రూ.320 నుంచి రూ.330 వరకు అమ్ముతున్నారు. కొన్ని రిటైల్ దుకాణాల్లో ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. చికెన్‌తోపాటు కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.6 నుంచి రూ.7 మధ్య ఉన్న ఒక్క గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది.
దాంతో 30 గుడ్ల ట్రే కొనాలంటే దాదాపు రూ.240 అవుతోంది. ప్రొటీన్ కోసం గుడ్లపై ఆధారపడే కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది. ఈ ధరల పెరుగుదలకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు పెరగడంవల్ల ఉత్పత్తి తగ్గింది. మరోవైపు మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ధరలు పెరగడంతో పౌల్ట్రీ నిర్వహణ వ్యయం కూడా పెరిగింది. దాంతో చాలామంది రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

