చికెన్ దహీ కబాబ్
ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చికెన్ వేసి బాగా కలిపి పావుగంటపాటు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు, క్రీమ్, చీజ్ తురుము, చాట్ మసాలా, యాలకుల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నానబెట్టిన చికెన్ కూడా వేసి బాగా కలపాలి
కావలసిన పదార్థాలు
చికెన్: అర కిలో(బోన్‌లెస్), అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు, గడ్డ పెరుగు: అర కప్పు, ఫ్రెష్ క్రీమ్: అర కప్పు, చీజ్ తురుము: ముప్పావు కప్పు, చాట్ మసాలా: అర టీస్పూన్, యాలకుల పొడి: పావు టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చికెన్ వేసి బాగా కలిపి పావుగంటపాటు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు, క్రీమ్, చీజ్ తురుము, చాట్ మసాలా, యాలకుల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నానబెట్టిన చికెన్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. పొడవాటి కబాబ్ స్టిక్స్‌కు చికెన్ ముక్కలను గుచ్చి రెండు వైపులా తిప్పుకొంటూ గ్రిల్ చేసుకుంటే నోరూరించే చికెన్ దహీ కబాబ్ సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

