IPL 2023 : ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఏకంగా ముగ్గురు అర్థ శతకాలు బాదారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(37), శివం దూబే(50) సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించారు. దాంతో ధోనీ సేన ఈ సీజన్లో అత్యధిక పరుగులు కొట్టింది. కోల్‌కతాకు 236 టార్గెట్ నిర్దేశించింది.
ఖెజ్రోలియా వేసిన 20వ ఓవర్లో రవీంద్ర జడేజా(18) దంచాడు. రెండు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు. ఆ తర్వాత బంతికి రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ(2) రెండు రన్స్ తీశాడు. దాంతో, 4 వికెట్ల నష్టానికి చెన్నై 235 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఖేజ్రోలియా రెండు, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ తలా ఒక వికెట్తీశారు.
Half-centuries for both Ajinkya Rahane and Shivam Dube!@KKRiders finally break the dangerous partnership as
Kulwant Khejroliya gets Dube out ✅@ChennaiIPL nearing the 200-run mark!Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/1vNxwsM7zH
— IndianPremierLeague (@IPL) April 23, 2023
టాస్ ఓడిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35), డెవాన్ కాన్వే(56 : 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సుయాశ్ శర్మ విడదీశాడు. తన మొదటి ఓవర్లోనే రుతురాజ్‌ను బౌల్డ్ చేశాడు. అజింక్యా రహానే(71 : 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివం దూబే(50 : 21 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. క్లాస్ ఆటతో అలరించిన రహానే కోల్‌కతా స్పిన్ త్రయాన్ని ఉతికి ఆరేశాడు.