న స్వల్పస్య కృతే భూరి
నాశయేన్మతి మాన్నరః
ఏత దేవాత్ర పాండిత్యం
యత్ స్వల్పాత్ భూరి రక్షణం
బుద్ధిమంతుడైన వాడు కొంచెం విలువగల దాన్ని కాపాడుకొనేందుకు ఎక్కువ విలువగల దాన్ని ఖర్చు చేయకూడదు. తక్కువ ఖర్చుపెట్టి ఎక్కువ విలువ గల దానిని కాపాడుకొనుటయే నిజమైన పాండిత్యం, విజ్ఞతగా భావించాలి.
టి.సుధాకరశర్మ