EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..

ఒకప్పుడు మన పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలో ఎంత ఉన్నదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్ నంబర్ మారుతుండేది. జీతంలో పీఎఫ్ కింద కత్తిరించిన మొత్తాన్ని మన అకౌంట్లో యాజమాన్యం జమ చేసిందో లేదో తెలిసేది కాదు. కానీ ఈపీఎఫ్‌వో సంస్థ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులకు ఈ దిగులంతా దూరమైంది. ఎన్ని కంపెనీలను మార్చినా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ మారడం లేదు. అలాగే యూఏఎన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన తర్వాత అకౌంట్‌ను ట్రాక్ చేయడం చాలా సులువైంది. మన బ్యాంక్ ఖాతా మాదిరిగానే తరచూ పీఎఫ్ అకౌంట్లోని సొమ్ము ఎంతన్నది చూసుకోవచ్చు. బ్యాంక్ పాస్‌బుక్ తరహాలోనే పీఎఫ్ పాస్‌బుక్
వచ్చిందిప్పుడు.
ఉమాంగ్ యాప్
ఇందులో ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను చూడవచ్చు. ఈపీఎఫ్ క్లెయిమ్‌లను ట్రాక్ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని పొందడానికి ఉమాంగ్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
ఈపీఎఫ్‌వో పోర్టల్
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మరో పద్ధతి epfindia. gov. in/ site_en/index.php. అనే వెబ్సైట్. లాగిన్ తర్వాత అవర్ సర్వీసెస్ అనే అప్షన్లో ఫర్ ఎంప్లాయిస్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సేవల విభాగంలో మెంబర్ పాస్‌బుక్ క్లిక్ చేస్తే పాస్‌బుక్ లోడ్ అవుతుంది. యూఏఎన్ నంబర్ యాక్టివేటైతే బ్యాలెన్స్ తెలిసిపోతుంది.
ఎస్ఎంఎస్
అన్నింటికన్నా సులువైన మార్గం ఎస్ఎంఎస్. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా ఫర్వాలేదు. EPFOHO UAN ENG (చివరి మూడు అక్షరాలు మీరు ఎంచుకున్న భాషకు ప్రాతినిథ్యం వహిస్తాయి) అని 7738299899 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు. యూఏఎన్ నంబర్‌తో రిజిస్టరైన మొబైల్ నంబర్‌నే ఇందుకోసం ఉపయోగించాలి.
మిస్డ్‌కాల్
ఈపీఎఫ్‌వో నంబర్‌కు మిస్డ్‌కాల్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. 011-22901406కు మీ రిజిస్టర్డ్ నంబర్‌తో మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వెంటనే ఈపీఎఫ్ఓ మీకు మీ పీఎఫ్ ఖాతా వివరాలన్నింటినీ పంపిస్తుంది. ఈ సేవలను పొందడానికి కూడా యూఏఎన్ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌నే వాడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

