గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385కోట్లు విడుదల చేసిన కేంద్రం
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385కోట్లు విడుదల చేసిన కేంద్రం | గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు

న్యూఢిల్లీ : గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఈ ఇప్పటి వరకు రూ.25,129.98 కోట్లు విడుదల చేసింది.
తాజాగా కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.2,162.4కోట్లు, మహారాష్ట్రకు రూ.1,292.1 కోట్లు, బీహార్‌కు రూ.1,112.7 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.883.2కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణకు రూ.409.5కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.518.7కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.628.5, ఏపీకి రూ.969.50 కోట్లు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, ఓడీఎఫ్, తాగునీటి సరఫరాకు.. మరో 40 శాతం నిధులు జీతాల చెల్లింపుతో పాటు పంచాయతీలు అభీష్టం మేరకు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

