పరాజయాల బాధ్యత నాదే

‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ తర్వాత నా కెరీర్లో గుర్తుండిపోయే మంచి సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వందశాతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు సంపూర్ణేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఆర్.కె. మలినేని దర్శకుడు. ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదలచేసింది. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘శీలాన్ని కోల్పోయిన ఓ మగాడి కథ ఇది. తనకు జరిగిన అన్యాయంపై అతడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఆండీఫ్లవర్, క్యాలీఫ్లవర్గా ద్విపాత్రాభినయంలో కనిపిస్తా. ‘కొబ్బరిమట్ట’ తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా ఆడలేదు. ఆ పరాజయాల బాధ్యత నాదే. ఈ సినిమాతో మళ్లీ విజయాల బాట పడతాననే నమ్మకముంది’ అని తెలిపారు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. మగాడు కూడా శీలాన్ని కాపాడుకోవడం అవసరమనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీధర్, రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

