BRS Protest | మేడ్చల్: మేడ్చల్‌లో రోడ్ల పరిస్థితిపై బీఆర్ఎస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరినాట్లు వేసి ఆందోళన వెల్లడించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏ వీధి చూసినా గుంతల పడి ధ్వంసమైన రోడ్లు, చినుకుపడితే కుంటలుగా మారుతాఉన్నియని ఆరోపించారు. నడవటం కూడా కష్టంగా ఉన్న ఈ వీధుల్లో వాహనదారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలిపారు. హౌజింగ్ బోర్డు కాలనీ, కేఎస్ఆర్ వెంచర్, కిందిబస్తీ, బాలాజీనగర్, ఉమానగర్లలో ఎక్కడా చూసినా ధ్వంసమైన రోడ్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాన్‌హోళ్లు తెరుచుకుని ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురికి నీళ్లు పొంగి పొర్లుతూ దుర్గంధం వెదలజల్లుతున్నాయని ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Medchal 1
కాంగ్రెస్ ప్రభుత్వం మేడ్చల్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీనం తర్వాత మరింత అధ్వానంగా
మారిందని విమర్శించారు. అధికారులు రోడ్లు, డ్రైనేజీ, నీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికులు, నాయకులు ప్రజా ఇబ్బందులపై పలుమార్లు అధికారులను దృష్టికి తీసుకెళ్లినా సమస్యలను పరిష్కరించడం లేదని వెల్లడించారు. దీంతో మేడ్చల్‌లో నెలకొన్న ఈ అధ్వాన పరిస్థితి, అధికారుల పట్టింపులేని వైఖరిపై బీఆర్ఎస్ నేత బాసురాది భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. జాతీయ రహదారి నుంచి
గ్రంథాలయానికి వెళ్లే రోడ్డులో హౌజింగ్ బోర్డు కాలనీ వద్ద నీటి గుంతగా మారిన రోడ్డుపై పలువురు స్థానిక మహిళలతో కలిసి వరినాట్లు వేశారు. కాంగ్రెస్ పాలన తీరుకు నిరసనగా ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, గద్దె దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో దయానంద్ యాదవ్, నవీన్ రెడ్డి, విష్ణు చారి, నడికొప్పు నాగరాజ్, సందీప్ గౌడ్, శంకర్, పద్మ పాల్గొన్నారు.