BRS Dharna | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
బాన్సువాడ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ( Jagadishwar Reddy ) సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) ఆదేశాల మేరకు బాన్సువాడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ( BRS) శ్రేణులు శనివారం ధర్నా నిర్వహించి అంబేద్కర్చిత్రపటానికి అందజేశారు.
ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి (Revanth reddy,) ఎన్నికల సమయం లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, 15 నెలల్లో ప్రజలకు ఒరుగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష నగదులో పాటు తులం బంగారం ఇస్తామన్నా హామీని ఎందుకు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి , కేసీఆర్ పై చేసిన అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. కేసీఆర్ ( KCR ) అప్పులు చేశారని లెక్కలు చూపుతున్నారని, తెచ్చిన అప్పులతో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణ , పంట పొలాలకు సాగు నీరు , కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు
15 నెలల కాలంలో నే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిజేబులు నింపుకున్నదని ఆరోపించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు మోచి గణేష్ , సాయిబాబా, గౌస్, చాకలి మహేష్, సాయిలు, మౌలా, సద్దాం, శివసూరి, రమేష్ యాదవ్, శంకర్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

