MLA Kaushik Reddy | 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, కోదండరాం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
MLA Kaushik Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సర్కార్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, కోదండరాం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో లక్షా 60 వేల 63 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఇప్పటికే పలుమార్లు చెప్పామని గుర్తు చేశారు. 42 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా, వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ ఉందన్నారు. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీతో పాటు ఇతర రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు వాస్తవాలను గ్రహించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

