పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, తెలంగాణ సాగునీటి జీవనాడి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కథనం నిరాధారమైందని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, తెలంగాణ సాగునీటి జీవనాడి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కథనం నిరాధారమైందని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని శ్రీధర్ పేర్కొన్నారు. అయితే, ఆర్టికల్ 19(2) ప్రకారం ఈ స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులు, బాధ్యతలు కూడా ఉంటాయని తెలిపారు. కనీస అధికారిక ఆధారాలు, సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించకుండా రాజకీయ దురుద్దేశంతో కథనాలు ప్రచురించడం వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడమేనని విమర్శించారు.
ఇలాంటి కథనాలు పరువునష్టం పరిధిలోకి వస్తాయని, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 356తో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన జర్నలిజం నైతిక ప్రమాణాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న కథనాన్ని 24 గంటల్లోగా ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ జారీ చేసిన నోటీసులకు తాను పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. నిజానిజాలను నిర్ధారించకుండా ప్రచురించే కథనాలను చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూనే, వార్తల ప్రచురణలో వాస్తవ నిర్ధారణ, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించాలని శ్రీధర్ పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- NRI BRS
- NRI BRS Switzerland
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

