బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు

బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కేవలం 24 గంటల వ్యవధిలో 1,641 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్ సర్కారు దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రమైందని మంగళవారం రాత్రి ప్రకటించింది.
దేశంలో పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విస్తృతితో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని తెలిపారు. కాగా, తాజా మరణాలతో కలిపి బ్రెజిల్లో కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 2,57,361కి చేరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

