గువాహటి: భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహై డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మెరిసిన లవ్లీనా ప్రతిభను గుర్తించిన అస్సాం ప్రభుత్వం క్రీడా కోటాలో డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరైన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో లవ్లీనా ఒకింత భావోద్వేగానికి లోనైంది.