వేసవి తాపం నుంచి ఉపశమనం అందించే నల్ల ఉప్పు..!

నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడకం తక్కువైంది. అయితే నిజానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి నల్ల ఉప్పు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
వేసవిలో చాలా మంది శీతలపానీయాలను తాగుతుంటారు. వాటికి బదులుగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని చల్లబరిచే గుణం నల్ల ఉప్పుకు ఉంటుంది.
మలబద్దకం సమస్య ఉన్నవారు నల్ల ఉప్పును రోజూ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
గ్యాస్ సమస్యలతో బాధపడేవారు చిటికెడు నల్ల ఉప్పు తింటే ఉపశమనం కలుగుతుంది.
కడుపులో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవారు, గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే ఫలితం ఉంటుంది.
వేసవిలో నల్ల ఉప్పును రోజూ వాడడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి చేయకుండా ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

