Ramratan Payal | పెట్రోల్, డీజిల్ తక్కువ ధర కావాలంటే ఆఫ్ఘన్ వెళ్లిపో.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
Ramratan Payal | పెట్రోల్, డీజిల్ తక్కువ కావాలంటే ఆఫ్ఘన్ వెళ్లిపో.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లండి.. అక్కడ చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు.
పెరిగిన పెట్రోల్ ధరలపై కట్నీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్‌ను ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లిపో. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో కరోనా రెండు వేవ్‌లో వచ్చాయని.. మూడో వేవ్ రాబోతుందన్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో మీకు తెలుసా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతల వాక్చాతుర్యం కొనసాగుతుందని.. వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్ ధర రూ.89.27 పలుకుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

