ఒడిశా అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల రభస

భువనేశ్వర్: ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఇవాళ ఒడిశా అసెంబ్లీలో రభస చోటుచేసుకుంది. ఈ ఏడాదికిగాను ఒడిశా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష సభ్యులు తమతమ స్థానాలను వీడి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లాలని స్పీకర్ ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు.
అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి సభకు క్షమాపణ చెప్పాలని అధికార బీజేడీ సభ్యులు కూడా ఆందోళన చేశారు. గత శుక్రవారం సుభాష్ పాణిగ్రాహి ప్రభుత్వం ధాన్యం సేకరణను పెండింగ్లో పెట్టడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సాక్షిగా శానిటైజర్ సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో సభలో ఆత్మహత్యాయత్నం చేసి సభా మర్యాదను మంటగలిపినందున పాణిగ్రాహి క్షమాపణ చెప్పాలని బీజేడీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో సభను వాయిదా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BJD
- BJP
- Congress
- Odisha Assembly
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

