Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
Gadari Kishore | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి ప్రాంతంలో మూడు మీటింగ్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సింగరేణి ప్రాంతంలో మూడు మీటింగ్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ( Gadari Kishore ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , .బీ ఆర్ ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలతో మాట్లాడగానే 34శాతం లాభాల వాటాను ప్రభుత్వం ప్రకటించిందని, ఆదిలాబాద్,నిర్మల్ రైతు గర్జనలో కూడా అత్య అద్భుతమైన ప్రసంగం చేశారని గుర్తుచేశారు.
ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకుడు బీర్ల ఐలయ్య ( Birla Ilaiah ) విప్ పదవి కోసం బ్రోకర్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్న డిఫెండర్ కారు కొని అందరికీ దావత్ ఇచ్చాడని, ఇచ్చిన తర్వాత అది వైరల్ కావడంతో కొడుకు కొనిచ్చాడని మాట మార్చాడని దుయ్యబట్టారు. స్కూల్లో చదువుతున్న కొడుకు కారును ఎలా కొనిస్తాడని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్క కంపెనీలో భూములు అమ్మి అనేక మందిని మోసం చేసినందుకే మోసగాడు, బ్రోకర్ అంటున్నానని వెల్లడించారు.
కేసీఆర్ కట్టించిన యాదాద్రి ఆలయం చూపించి ప్రజలను మోసం చేసిన ఘనత బీర్లకే దక్కిందని పేర్కొన్నారు. రైతుల ఎండిన పంటలు పరిశీలించి వారికి నష్ట పరిహారం ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. గడ్డం పెంచుకుంటే నాలాగా అవుతారా అంటు ఎగతాళి చేతున రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఓటు నోటు కేసులో దొంగలాగా చిక్కిన మీరు అలాంటి దొంగ లాగా కేటీఆర్ ఎందుకు అవుతాడని అన్నారు. భారత్ సమ్మిట్‌ను ప్రజల సొమ్ము తో ఎందుకు పెడుతున్నా రని విమర్శించారు. సమ్మీట్ల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బిర్లా ఐలయ్య స్పెక్ట్రా మీద విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

