Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తి ఎమోషనల్ టర్న్ తీసుకుంది. కెప్టెన్ డీమాన్‌కి వచ్చిన స్పెషల్ పవర్‌తో రీతూ చౌదరిని సేవ్ చేస్తాడని అందరూ భావించగా, హరీష్ ఇచ్చిన కోటేషన్ ప్రభావంతో చివరికి ఆయన దమ్ము శ్రీజను కాపాడాడు. ఈ నిర్ణయం రీతూని తీవ్రంగా కుంగదీసింది. నిన్ను కెప్టెన్ చేసింది నేనే.. అందుకే నన్నే నామినేట్ చేశారు అంటూ రీతూ కన్నీళ్లు పెట్టుకోగా, డీమాన్ మాత్రం “నువ్వు విన్నది నిజం కాదు” అంటూ ఓదార్చాడు. మరోవైపు, “అందరూ కలిసి నన్ను నెగటివ్ అన్నారు” అంటూ శ్రీజ కూడా ఎమోషనల్ అయింది. చివరికి ఇమ్మానుయేల్ “నువ్వు నా సొంత చెల్లెలివి” అంటూ ఓదార్చడంతో ఆమె మూడ్ మారింది.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలను బయటపెట్టడానికి రీతూ రెడీ అయింది. తనూజకు కళ్యాణ్‌పై ఉన్న సాఫ్ట్ కార్నర్‌ని, పవన్ వ్యక్తిగత లవ్ స్టోరీని బయటపెట్టింది. “సాయంత్రం లోపే అందరి దగ్గరా సీక్రెట్స్ కనుక్కొని చెబుతా” అంటూ మరింత ఆసక్తిని పెంచింది. ఇక గార్డెన్ ఏరియాలో బిగ్‌బాస్ ప్రత్యక్షమై, యాపిల్ ట్రీ టాస్క్ ద్వారా కంటెస్టెంట్స్‌ను మూడు టీమ్స్‌గా విభజించాడు.
రెడ్ టీమ్: భరణి, హరీష్, రాము, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్
బ్లూ టీమ్: ఇమ్మానుయేల్, తనూజ, సంజన, సుమన్ శెట్టి, ప్రియ
బ్లాక్ టీమ్: ఫ్లోరా, రీతూ, శ్రీజ
“ఇకమీదట ఆటను నేనే నడిపిస్తా.. ట్రైలర్ అయిపోయింది, ఇప్పుడు సినిమా చూపిస్తా” అంటూ బిగ్‌బాస్ ప్రకటించడంతో కంటెస్టెంట్స్‌లో టెన్షన్ పెరిగింది. అనంతరం బ్లూ టీమ్ సభ్యులకు ఫ్యామిలీ నుంచి లెటర్స్, ఆడియో మెసేజ్‌లు, ఫొటోలు చూసే అవకాశం లభించింది. బజర్‌ను మొదటగా నొక్కిన ఇమ్మానుయేల్, తక్కువ బ్యాటరీ ఖర్చు అయ్యే ఆప్షన్‌గా తన ఫ్యామిలీ ఫొటోనే ఎంచుకున్నాడు. ఆ ఫొటో చూసి ఎమోషనల్ అవ్వగా, హౌస్మేట్స్ కూడా హృదయానికి హత్తుకునే రీతిలో స్పందించారు. ఎపిసోడ్ చివరిలో ఇమ్మానుయేల్ ఫ్యామిలీ జ్ఞాపకాలతో ఎమోషనల్ కాగా, మిగిలిన బ్లూ టీమ్ సభ్యులకు ఎలాంటి అవకాశాలు దక్కాయి అనేది రాబోయే ఎపిసోడ్లో రివీల్ కానుంది.