Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ పూర్తిగా భరణి–రీతూ మధ్య జరిగిన ఫైటింగ్‌తోనే పూర్తైంది. వీరిద్దరి మధ్య రసవత్తరంగా జరిగిన ఛాలెంజ్‌లో రీతూ గెలిచినా… టాస్క్ తీర్పు తప్పుగా ఇచ్చారని భరణి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరి రౌండ్లో తనూజకు డౌట్ రావడంతో భరణికి అవకాశం వచ్చింది. అయితే నిర్ణయం ఇచ్చిన సంచాలక్ సంజన తీర్పుపై భరణి బిగ్ బాస్‌కు నేరుగా కంప్లైంట్ ఇచ్చాడు. తాజా ప్రోమో ప్రకారం, జంక్యార్డ్లోని ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ గుర్తించి ముందు పెట్టినవారే గెలుస్తారు.అయితే రీతూ పెట్టిన ఆకారాల్లో ఒకటి ట్రయాంగిల్ కాదని భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు.
అది రెక్టాంగిల్… ఎలా ట్రయాంగిల్ అంటారు?, అయినా రీతూనే విన్నర్‌గా అనౌన్స్ చేశారు. ఇది తప్పు నిర్ణయం అంటూ భరణి బిగ్ బాస్‌కు అధికారికంగా కంప్లైంట్ చేశాడు. రీతూ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది. నా పేరు ఎందుకు తీస్తున్నారు? అది ట్రయాంగిల్ కాదంటారా? అని అరిచింది. దీనితో భరణి నీతూ నేను మాట్లాడలేదు అంటూ సీరియస్ అయ్యాడు. అక్కడితో ఆగని భరణి పాత విషయాలన్నీ తీసాడు. ఎక్కడెక్కడ ఛీటింగ్ జరిగింది…, ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో…మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి… అంటూ డీమాన్, కళ్యాణ్‌తో జరిగిన పాత టాస్క్ వివాదాలను బహిర్గతం చేశాడు.
భరణి పాత విషయాలు తెస్తుండగా కళ్యాణ్ భగ్గుమన్నాడు.కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు.డీమాన్‌కి ఆ విషయం తెలియదు.నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? అంటూ కళ్యాణ్ భరణిపై మండిపడ్డాడు. దీనికి భరణి కూడా దూకుడుగా స్పందిస్తూ.. నీ పేరు తెచ్చానా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్ అని కళ్యాణ్ పైకి వెళ్లాడు. ఇన్నాళ్లు కూల్‌గా ఉన్న భరణి… ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో హీట్ పెంచాడు. తన విశ్వరూపం చూపించాడు. మొత్తంగా బిగ్ బాస్ ఇంట్లో టెన్షన్, డ్రామా, వాదనలు గరిష్టానికి చేరాయి. రానున్న ఎపిసోడ్లలో ఇంకా ఎలాంటి బ్లాస్ట్‌లు జరుగబోతున్నాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.