వ్యాక్సిన్ ధరను తగ్గించండి.. కేంద్రానికి ఛత్తీస్‌గఢ్ సీఎం లేఖ
వ్యాక్సిన్ ధరను తగ్గించండి | కొవిడ్-19 వ్యాక్సిన్ ధరను వీలైనంత తక్కువగా నిర్ణయించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

రాయ్‌పూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్ ధరను వీలైనంత తక్కువగా నిర్ణయించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. టీకా ధర వీలైనంత తక్కువగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్రానికి రూ.150కి సరఫరా చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.600 చొప్పున ధర నిర్ణయించడాన్ని తప్పుట్టారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోనే అత్యధిక రేటుకు భారత్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా అదనపు లాభాలను సంపాదించే లక్ష్యంతో టీకా రేట్లను సీరం సంస్థ పెంచిందని లేఖలో పేర్కొన్నారు. ఈ దోపిడీని నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ కనీస రేటును కేంద్రం నిర్ణయించాలని, ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్ల తెలిపారు. దేశంలో టీకాలు తయారు చేసే రెండు సంస్థలు మాత్రమే ఉన్నందున.. టెండర్ ద్వారా వ్యాక్సిన్ సేకరణలో ఆరోగ్యకరమైన పోటీ, కనీస రేటు పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు.

వ్యాక్సిన్ల కనీస రేటును కేంద్రం ఆధీనంలో బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యు ఆఫ్ ఇండియా (బీపీపీఐ) నిర్ణయించాలని కోరారు. బీపీపీఐకి చెల్లింపులు చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా వ్యాక్సిన్ సేకరించాలని, తద్వారా దేశం మొత్తం ఒకే రేటుకు వ్యాక్సిన్ అందుతుందన్నారు. వీలైనంత తర్వగా ధరలను నిర్ణయిస్తే.. వచ్చే నెల 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ చేపట్టేందుకు వీలవుతుందని లేఖలో సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. అందుబాటులో 3,816 కోచ్‌లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
కరోనాతో బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి మృతి
‘జన్‌కీ బాత్’ ముఖ్యం.. : రాహుల్ గాంధీ
పీఎం కేర్ నిధులతో దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

