Chhattisgarh Polls | అమిత్ షా సవాల్‌కు భూపేష్ బఘేల్ సై..చర్చకు సిద్ధమన్న చత్తీస్ఘఢ్ సీఎం
చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Polls) తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయ్‌పూర్ : చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Polls) తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్‌కు భూపేష్ బఘేల్ అంగీకరించారు. గత ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి, 15 ఏండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సీఎం ప్రకటించారు. 15 ఏండ్లుగా మీ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలు, ఐదేండ్లలో తాము చేసిన పనులపై చర్చ జరగాలని భూపేష్ బఘేల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
నల్ల రంగు సోఫాపై ఇరువైపులా అమిత్ షా, భూపేష్ బఘేల్ పేర్లున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. చర్చా వేదిక, సమయం, ప్రదేశం గురించి మీరు ఇంకా వెల్లడించలేదని, అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే వేదికను సిద్ధం చేశారని రాసుకొచ్చారు.
కాగా చత్తీస్ఘఢ్లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ మోదీ 15 ఏండ్ల హయాంలో జరిగిన అభివృద్ధి, చత్తీస్ఘఢ్లో భూపేష్ బఘేల్ హయాంలో ఐదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక చత్తీస్‌ఘఢ్‌లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఈనెల 17న మలివిడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

