అంచనాలు.. ముంచేస్తాయి
ఎన్నో అంచనాలతో కొత్త బంధంలోకి ప్రవేశిస్తారు. తొలిదశలో అంతా బాగానే అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత తేడా కనిపిస్తుంది. మెసేజ్లు పట్టించుకోరు. వెంటనే బదులివ్వరు. మనసువిప్పి మాట్లాడరు. దీంతో ఆశలు తలకిందులు అవుతాయి. కలవరపాటుకు గురవుతారు. అర్థంలేని అంచనాలే ఈ కష్టాలకు కారణం..
ఎన్నో అంచనాలతో కొత్త బంధంలోకి ప్రవేశిస్తారు. తొలిదశలో అంతా బాగానే అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత తేడా కనిపిస్తుంది. మెసేజ్లు పట్టించుకోరు. వెంటనే బదులివ్వరు. మనసువిప్పి మాట్లాడరు. దీంతో ఆశలు తలకిందులు అవుతాయి. కలవరపాటుకు గురవుతారు. అర్థంలేని అంచనాలే ఈ కష్టాలకు కారణం..
నా మాటే శాసనం..
భాగస్వామి అన్నివేళలా మీ అభిప్రాయాలతో ఏకీభవించాలని కోరుకుంటున్నారా? పొరపాటున, తన నుంచి ‘కాదు’ అనే జవాబు వస్తే.. నిరాశలోకి వెళ్లిపోతున్నారా? నిజానికి, ఏ ఇద్దరి మధ్యా అన్ని విషయాల్లోనూ అంగీకారం కుదరడం అన్నది దాదాపుగా అసాధ్యం.
చెప్పకుండానే తెలుసుకుని..
మనం చెప్పాల్సిన అవసరం రాకుండానే, మన మనసులో ఏమున్నదో తెలుసుకుని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుకుంటారు కొందరు. ఇది గొంతెమ్మ కోరిక లాంటిదే. ఎంత ప్రేమించినా.. అన్నిసార్లూ తెలుసుకోలేకపోవచ్చు. మనకేం కావాలన్నది భాగస్వామితో స్పష్టంగా చెప్పడమే మేలు. బాధ, సంతోషం, కోరికలు, కలలు, ఇష్టాలు.. అన్నీ తనతో మనసు విప్పి పంచుకోండి.
చిన్న తప్పూ చేయకూడదు..
ఎంతటివారైనా తప్పులు చేస్తారు. తను ఎప్పుడైనా పొరపాటు చేస్తే క్షమించగలిగే సహృదయత ఉండాలి. క్షమాగుణం కరువైతే..ఆ బంధం దీర్ఘకాలం కొనసాగడం అసాధ్యం. జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు అపశ్రుతులు దొర్లినా.. విస్మరిస్తూ ముందుకు సాగాల్సిందే.
పర్ఫెక్షనిస్ట్ అయితేనే..
సృష్టిలో ఏదీ పరిపూర్ణం కాదు. మనిషి కూడా అందుకు మినహాయింపు కాదు. జీవిత భాగస్వామిలో పరిపూర్ణతను ఆశించినకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. లోపాలను విస్మరిస్తూ, పరిమితులను అర్థం చేసుకుంటూ సాగిపోవడమే జీవితం.
ఎప్పుడూ నా గురించే..
భాగస్వామి ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ ఉండాలని ఆశించడం సరికాదు. తనకంటూ కొంత స్పేస్ ఇవ్వాలి. సంఘజీవిగా కొలీగ్స్, ఫ్రెండ్స్ కోసం ఎంతోకొంత సమయం కేటాయించాల్సి ఉంటుందని గ్రహించాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- affair
- cautious
- counselling
- Live in
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

