17 రంగులు, 15 డిజైన్లు

- అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరెలు సిద్ధం
- అక్టోబర్ 6లోగా పంపిణీ చేయాలని లక్ష్యం
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలకు చేరుకొంటున్నాయి. ఈసారి కూడా 18 ఏండ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 6లోగా ఈ చీరెల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1.05 కోట్ల మంది అర్హులైన మహిళలుండగా.. ఏటా దాదాపు 97 లక్షల మంది బతుకమ్మ చీరెలు తీసుకొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరెలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్లో 12 లక్షల చీరెలు తయారు చేశారు. వీటిలో ఇప్పటికే 35 లక్షల చీరెలను 18 జిల్లాలకు తరలించి గోదాముల్లో భద్రపరిచారు. మిగిలిన జిల్లాలకు రానున్న పక్షం రోజుల్లో చీరెలను రవాణా చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరెలను తయారు చేశారు. చీరెలోనే బ్లౌజ్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ చీరెల తయారీ ద్వారా దాదాపు 10 వేలమంది నేత కార్మికులు, 5 వేలమంది డిజైనర్లు, ఇతర అనుబంధ కార్మికులు ఉపాధి పొందినట్లు అధికారులు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

