ఔషధ గుణాల పూల జాతర
పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయి చేయి కలిపి ఆడి, పాడి ఆనందం పంచేలా చేస్తుంది.
పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయి చేయి కలిపి ఆడి, పాడి ఆనందం పంచేలా చేస్తుంది.
తరాలకు అందించవలసిన ప్రకృతితో మిళితమై ఉన్న ఈ పండుగలో రంగురంగుల పూలతో తీర్చే బతుకమ్మలు ఆనందాన్నే కాకుండా ఆ పల్లె అంతటికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక చర్యగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ పూలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. దొంతరలు గా పేర్చిన పూలను ఊరి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వానకాలంలో వరదగా వచ్చి చేరిన చెరువు నీరు శుభ్రమవుతుంది.
బతుకమ్మ పండుగ వానకాలం తర్వాత వస్తుంది. వానల కారణంగా చెరువుల్లో చేరిన వరదనీరు, కొత్తనీరులో ఎన్నో క్రీములు ఉంటాయి. వీటి కారణంగా చెరువు నీరు కలుషితం అవుతుంది. ఈ నీరు తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే బతుకమ్మ పండుగ తర్వాత చెరువు నీరు శుభ్ర పడటం గ్రామాల్లో గమనించవచ్చు. ఇందుకు కారణం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడమే. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే ఆకుల్లో, పూలలో యాంటీ బయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ల లాంటివి నశించి పోతాయి. దాంతో చెరువులు, కుంటల్లోని నీళ్లు పరిశుభ్రంగా మారుతాయి.
తంగేడు : తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తించబడిన తంగేడులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. తంగేడును వృక్షశాస్త్రంలో కాసియా ఆరిక్యులేటా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చర్మసంబంధమైన సమస్యల నివారణకు, కండరాల నొప్పుల నివారణ కోసం తంగేడను వాడుతారు.
గునుగు పూలు : పంటచేల వెంట పెరిగే గునుగు రైతన్న పాలిట ఔషధగని. పురుగు కుడితే గునుగు, దెబ్బ తగిలితే గునుగు ఇలా పొలంలో పనిచేసే రైతన్నకు ఏ ఆపద వచ్చినా గునుగునే ఆశ్రయిస్తాడు. దెబ్బ తగిలిన చోట గునుగు ఆకులను ముద్దగా నూరి కడితే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది.
బంతి : దోమలు, క్రీముల నివారణలో బంతిపూల నుంచి వచ్చే పరిమళం ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ పూల నుంచి తీసే నూనెలోనూ యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాస్మెటిక్స్ తయారీలో బంతి పూలను విరివిగా ఉపయోగిస్తారు.
గుమ్మడి : విటమిన్ సీ, ఏ ఎక్కువగా ఉండే గుమ్మ డి ఆకులు, పూలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. గుమ్మడి కాయను కూరగా, స్వీట్‌గా తింటాం. అయితే కాయలోనే కాదు ఆకులు, పూలు కూడా ఔషధ గనులే.
ఇదేవిధంగా బతుకమ్మను అందంగా ముస్తాబు చేయడంలో వాడే సీతమ్మ జడపూలు, రుద్రాక్ష (పొకబంతి పూలు) పూలు, చేమంతులు, లిల్లీ పూలు ఇలా అన్నీ ఔషధగుణా లు కలిగినవే. పూల జాతరగా ఏటా ఈ పండుగను ఆనందంగా ఆడి పాడటంతో ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది.
(అక్షరయాన్ సౌజన్యంతో..)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

