చలికాలం.. చన్నీటి స్నానం
చలికాలంలో చన్నీళ్ల స్నానం మంచిదేనా? అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు.. దీని వెనుక కూడా లాభనష్టాలు ఉన్నాయి
చలికాలంలో చన్నీళ్ల స్నానం మంచిదేనా? అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు.. దీని వెనుక కూడా లాభనష్టాలు ఉన్నాయి.
ప్రయోజనాలు..
- ఆరోగ్యవంతులైన యువతీ యువకులు నిరభ్యంతరంగా చన్నీటి స్నానం చేయొచ్చు. ఒంటిపై పడే చల్లని జల్లులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
- చన్నీటి స్నానంతో ధమనులు బలంగా తయారవుతాయి. రక్తపోటు తగ్గుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్ లక్షణాలు కూడా మటుమాయం అవుతాయి.
- వాపు, కండరాల నొప్పులు తగ్గిపోతాయని కూడా నిపుణులు చెబుతారు.
- చన్నీటి స్నానం జుట్టుకు మంచిది. కేశ రంధ్రాలు ధూళితో మూసుకుపోకుండా చేస్తుంది.
- చన్నీటి స్నానంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
నష్టాలు..
- చలికాలంలో అదే పనిగా చన్నీటి స్నానం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. ఉబ్బస రోగులకు ప్రాణాంతకంగా మారొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు కారణం కావచ్చు.
- మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలున్న వృద్ధులు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలి.
- గుండె జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
- రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చిరాకు, జ్వరం తదితర సమస్యలకు మూలం అవుతుంది.
మధ్యేమార్గం..
ఒక్క శీతకాలమనే కాదు.. ఏ రుతువులో అయినా స్నానానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది. చలికాలం తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్లు పోసుకోకూడదు. ఇది స్ట్రోక్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. తరచూ వ్యాయామం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చురుకుగానూ ఉంటారు. తాజా పండ్లు, ఆకుకూరలతో సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

