ఇంటి రుణం తీసుకుంటున్నారా?! పన్ను ఇన్సెంటివ్‌లు ఇవే!!

న్యూఢిల్లీ: మీరు ఇంటి రుణం తీసుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారా..?! అయితే, ఇదే మంచి తరుణం..!! మార్కెట్లో డిమాండ్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని రోజులుగా పలు బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఖాతాదారులకు ఇంటి రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) తగ్గించింది.. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వేశాయి.
అయితే, ఇంటి రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు కొత్త రుణ గ్రహీతలకే వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీతలకు ఈ బెనిఫిట్లు లభించబోవని అంటున్నారు. ఒకవేళ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపొరేట్ తగ్గిస్తే మాత్రం ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుందంటున్నారు.
ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి తీసుకున్న హౌసింగ్ లోన్ తీసుకున్న మొత్తంలో రూ.1.5 లక్షలకు ఐటీ చట్టంలోని 80సీ కింద మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేసిన ఐదేండ్లలో ఇల్లు అమ్మేస్తే మాత్రం మినహాయించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి బదిలీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఖర్చులపై తొలి ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు 80సీ కింద మినహాయింపునిస్తారు.
ఆదాయం పన్ను చట్టంలో 24 (బీ) సెక్షన్ కింద ప్రతి పన్ను చెల్లింపు దారు తాను చెల్లించే ఇంటిరుణ వాయిదాల్లో రూ.2 లక్షల వరకు వడ్డీపై పన్ను మినహాయింపు కోరతారు. ఇది ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే సదరు రుణ గ్రహీతకు వర్తిస్తుంది.
కొత్తగా ఐటీ మినహాయింపులను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017-18లో ఐటీ చట్టంలో 80ఈఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేల రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అందుకు అమలులో ఉన్న షరతులు ఇవే:
- 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంస్థ/ బ్యాంక్ మంజూరు చేసిన రుణమై ఉండాలి.
- సదరు రుణం రూ.35 లక్షలకు తక్కువగా ఉండకూడదు.
- ఆస్తి విలువ రూ.50 లక్షలు దాటొద్దు.
- ఇంటి రుణం పొందే నాటికి సదరు వ్యక్తి తొలిసారి ఇంటి యజమాని అయి ఉండాలి.
- ఈ సెక్షన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్న వారికి రుణ వాయిదాల్లో వడ్డీ చెల్లింపుపై ఇతర సెక్షన్ల కింద క్లెయిమ్ చేయడానికి అనుమతించరు.
- రుణ వాయిదాల చెల్లింపు పూర్తయ్యే వరకు ఐటీ చట్టంలోని 80ఈఈ సెక్షన్ కింద వడ్డీపై పన్ను రాయితీ లభించినా.. పైన పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. 80ఈఈ సెక్షన్ నిబంధనలకు లోబడి రుణం తీసుకున్న వారికి రుణ వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
- కొత్తగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 80ఈఈఏ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి పన్ను మినహాయింపులు కల్పించేందుకు ఈ సెక్షన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సెక్షన్ కింద అదనంగా రూ.1.5 లక్షలకు వడ్డీపై పన్ను మినహాయింపునకు అమలు చేయాల్సిన నిబంధనలు ఇవే: - 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021 మార్చి 31 వరకు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
- ఆస్తి విలువ రూ.45 లక్షలు దాటొద్దు.
- పన్ను చెల్లింపు దారుడు తొలిసారి రుణం తీసుకున్న వ్యక్తి అయి ఉండాలి.
- ఐటీ చట్టంలోని 80ఈఈ సెక్షన్ కింద డిడక్షన్ పొందిన వారికి మినహాయింపు ఉండదు.
ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది నవంబర్ 12వ తేదీన ఇండ్ల డెవలపర్లు, కొనుగోలు దారులకు రిలీఫ్‌నిచ్చే చర్యను తీసుకున్నారు. దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీలకు డిమాండ్‌ను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. తొలిసారి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసి ఇల్లు కొనుగోలు చేసిన వారు ఈ పథకం కింద మినహాయింపు కోరొచ్చు. వీరికి 20 శాతం వరకు ఆదాయంపన్ను రాయితీ వచ్చే జూన్ 30 వరకు అమలులో ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- banks
- home loans
- incentives
- it act
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

