NTR | నందమూరి హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ బాబాయ్ నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ పాపులర్ డైలాగ్‌ను అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో పలికితే.. ఆ క్షణం ఎలా ఉంటుందో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకలో కనిపించింది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమా టైటిల్ ప్రస్తావన వచ్చిన సమయంలో తారక్ తన బాబాయ్ బాలకృష్ణను గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలోని పాపులర్ ఇంగ్లీష్ డైలాగ్‌ను తారక్ వేదికపై తనదైన శైలిలో పలికారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్! ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ది ట్రూత్ !”. బాలకృష్ణ స్క్రీన్‌పై చెప్పిన ఆ డైలాగ్‌ను తారక్ తన బేస్ వాయిస్, బాడీ లాంగ్వేజ్‌తో చెప్పడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. తారక్ డైలాగ్ పూర్తిచేయగానే ప్రాంగణం చప్పట్లు, కేకలతో మార్మోగిపోయింది.బాలకృష్ణకు చెందిన ఈ ఇంగ్లీష్ డైలాగ్ ఇప్పటికే సినిమాకు సంబంధించిన మీమ్స్, సామాజిక మాధ్యమాల వీడియోల్లో విస్తృతంగా వినిపిస్తుంటుంది. అలాంటి డైలాగ్‌ను జూనియర్ ఎన్టీఆర్ వేదికపై గుర్తుచేసుకోవడంతో నందమూరి అభిమానులకు ఈ క్షణం ప్రత్యేకంగా మారింది.
ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్‌ను తారక్ అనుకరించకుండా, తన స్వంత శైలిలో పలకడం అభిమానులను ఆకట్టుకుంది. బాబాయ్‌పై తనకున్న అభిమానాన్ని తారక్ ఇలా వేదికపై చాటుకున్నారంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తారక్ డైలాగ్ చెప్పిన వీడియో క్లిప్ బయటకు వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. అభిమానులు ఆ వీడియోను పెద్ద ఎత్తున పంచుకుంటూ తమకు నచ్చిన సన్నివేశంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రీ-రిలీజ్ వేడుకలో తారక్ ప్రత్యేక ఎంట్రీ, రాఘవేంద్రరావు చేసిన సరదా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్‌ను తారక్ పలికిన సందర్భం కూడా మరో హైలైట్‌గా నిలిచింది.
🥵🔥 #jrntr #donttroublethetrouble #dttt #balakrishna pic.twitter.com/0onH16Fd3a
— Hyderabad Hawaaa Memes (@tweetsrawww) September 29, 2026