e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News ఆయుష్మాన్ డ్రీమ్ గ‌ర్ల్ తెలుగు రీమేక్‌కు రెడీ

ఆయుష్మాన్ డ్రీమ్ గ‌ర్ల్ తెలుగు రీమేక్‌కు రెడీ

ఆయుష్మాన్ డ్రీమ్ గ‌ర్ల్ తెలుగు రీమేక్‌కు రెడీ

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన అంధాధున్ చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయుష్మాన్ మ‌రో హిట్ చిత్రం డ్రీమ్ గ‌ర్ల్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా సిద్ద‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సురేశ్‌బాబు డ్రీమ్ గ‌ర్ల్ రీమేక్ రైట్స్ ను ద‌క్కించుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. యువ హీరో రాజ్ త‌రుణ్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. ఇటీవ‌లే ప‌వ‌ర్ ప్లే ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ..ఓరేయ్ బుజ్జిగా, ప‌వ‌ర్ ప్లే డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండ డ్రీమ్ గర్ల్ తెలుగు రీమేక్‌లో జాయిన్ అవుతున్న‌ట్టు చెప్పాడు. 

దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌కట‌న, మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన డ్రీమ్‌గ‌ర్ల్ చిత్రం ఆయుష్మాన్ కెరీర్‌లో వ‌న్ ది ఆఫ్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నుస్ర‌త్ భ‌రూచా హీరోయిన్ గా న‌టించ‌గా.. అన్నుక‌పూర్ కీ రోల్ పోషించారు. మ‌రి తెలుగు వెర్ష‌న్ లో రాజ్‌త‌రుణ్ ఎలా ఎంట‌ర్ టైన్ చేస్తాడో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
ఆయుష్మాన్ డ్రీమ్ గ‌ర్ల్ తెలుగు రీమేక్‌కు రెడీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement