అర్జున్ తేజ్, వర్షిణి, మౌనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మల్లె మొగ్గ’.హెఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్నా నాగరాజు సమర్పణలో తోటవెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుపుకుంది.‘గతంలో సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది. సినిమాను కమర్షియల్ పద్దతిలో వెళ్లకుండా అవార్డులు గెల్చుకునేలా రూపొందించాం.’అని దర్శకనిర్మాత తోటవెంకట నాగేశ్వరరావు అన్నారు.