Cars Festive Discounts | వివిధ మోడల్ కార్లపై ఆకర్షణీయ ఆఫర్లు.. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ.. ఇవీ డిటైల్స్..!
Cars Festive Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
Cars Festive Discounts | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కొత్తగా కారు కొనాలని భావించే వారికి ఆటోమొబైల్ సంస్థలు తీపి కబురు అందించాయి. ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేశాయి.
ఆ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్, లాయాల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. వీటితోపాటు డీలర్లు విడి భాగాలపైనా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్, సెడాన్ మోడల్ కార్లు మొదలు ఎస్‌యూవీలు, సీఎన్జీ వేరియంట్ల వంటి అత్యంత గిరాకీ ఉన్న మోడల్ కార్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
మారుతి సుజుకి తన ఆల్టో, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడల్ కార్లపై రూ.61 వేలు, స్విఫ్ట్ మోడల్‌పై రూ.54 వేల డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. అన్ని మోడల్ కార్లకు డిస్కౌంట్లు వర్తించబోవని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
టాటా మోటార్స్ తన నెక్సాన్, సఫారీ, హారియర్ మోడల్ కార్లను అప్ డేట్ చేసింది. ఈ నేపథ్యంలో పాత మోడల్ కార్లపై రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది.
హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కార్లపై రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నది. గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.43 వేలు, ఔరాపై రూ.33 వేలు, ఈవీ కోనాపై రూ.2 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఎక్స్‌యూవీ300పై రూ.90 వేలు, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీపై రూ.1.25 లక్షలు, బొలెరోపై రూ.70 వలు, బొలెరో నియోపై రూ.50 వేలు డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాస్ మోడల్ కార్లపై రాయితీలు ఇవ్వట్లేదు.
ఇంకా సిట్రోన్ సీ5 ఎయిర్‌క్రాష్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, టయోటా హిలక్స్ జీప్ కంపాస్, జీప్ మెరీడియన్, ఎంజీ హెక్టార్, ఎంజీ జడ్ఎస్ ఈవీ కార్లపై రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
దేవీ నవరాత్రి ఉత్సవాలు, విజయ దశమి, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పది లక్షల కార్లు అమ్ముడవుతాయని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

