Crime | కట్టమైసమ్మ దేవాలయంలో చోరీకి విఫలయత్నం

దోమలగూడ : హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కట్టమైసమ్మ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రాచీనమైన కట్టమైసమ్మ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన మార్గంలో ఉన్న గ్రిల్స్‌ను తొలిగించి, హుండీని పగలగొట్టే ప్రయత్నం చేసారు.
అయితే హుండీకి సెంట్రల్ లాకింగ్ ఉండడంతో, అది తెరుచుకోలేదు. ఆ పక్కనే ఉన్న మరో బీరువా తాళం తీసి ఉండడంతో, వాటిలో ఉన్న సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. బుధవారం ఉదయం దీన్ని గమనించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి వచ్చి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం ఆలయ ఈఓ సాంబశివ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

