కరోనా రోగులకు కృత్రిమ ఆత్మీయ స్పర్శ

హైదరాబాద్: జబ్బుపడ్డప్పుడు ఆత్మీయ కరస్పర్శ ఉంటే బాగుంటుంది. కానీ ఇవి కరోనా రోజులు కదా.. ముట్టుకోవాలంటేనే భయం. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు. అందుకే విడిగా ఉంచిన రోగులకు మానవ స్పర్శ లాంటి అనుభూతి కలిగించే ఓ సాధనాన్ని బ్రెజిల్ నర్సులు కనిపెట్టేశారు. రెండు చేతి గ్లౌజులను తీసుకుని వేళ్ల దగ్గర కలిపి ముడులు వేసి వేడి నీటితో నింపుతారు. రెండు చేతులు తయారు. ఆ సందుల్లో పేషంటు తన చేతిని జొనిపితే చాలు. రెండు చేతుల మధ్య తన చేయి ఉన్న ఫీలింగ్ కలుగుతుందన్న మాట. ఈ గ్లౌజుల ఫొటోలు నెటిజనుల మనసును కదిలించాయి. ఈ సాధనానికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని చెయ్యి అని పేరు కూడా స్థిరపడింది. చూసినవారందరూ ప్రస్తుత పరీక్షా సమయంలో ఈ ఫొటోలు కదిలించాయని కామెంట్స్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

