పృథ్వీరాజ్ హీరోగా వశిష్టపార్థసారథి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆరాధన’. రవికిరణ్, రుద్రభట్లవేణుగోపాల్ నిర్మాతలు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రేమపయనంలో ఓ జంటకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. టైటిల్ గొప్పతనాన్ని చాటిచెప్పేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, పాటలు: రెహమాన్.