AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
AP News | ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్యదిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం (Vishakhapatnam) లోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ నెల 16న తుపానుగా, 18న ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు.
AP News : ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్యదిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం (Vishakhapatnam) లోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ నెల 16న తుపానుగా, 18న ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని తెలిపారు.
ఈ నెల 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. ఈనెల 16 నుంచి తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం సాయంత్రానికి తీరాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 16 నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

