వ్యవసాయశాఖ అధికారులతో ఏపీ మంత్రి పేర్నినాని సమీక్ష…

మచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృఢ సంకల్పమని ఏపీ రవాణాశాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్ లోఖరీఫ్ సాగు సమాయత్తంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని),రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతుల కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని, అందులో భాగంగా రైతు భరోసా క్రింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. జిప్సం,జింకు తదితర పోషకాలు మొదలుకొని విత్తనాలు ,ఎరువులు పురుగు మందులే కాకుండా ధాన్యం విక్రయించుకోవాలన్నా రైతుభరోసా కేంద్రమే రైతన్నకు దిక్సూచి కావాలన్నారుమంత్రి పేర్ని నాని.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

