కేసుల కలకలం : లాక్డౌన్ దిశగా జర్మనీ!

బెర్లిన్ : కరోనా వైరస్ కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొద్దికాలం పాటు లాక్డౌన్ విధించేందుకు ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సానుకూలంగా ఉన్నారని ఆమె ప్రతినిధి గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్డౌన్ అమలుకు మెర్కెల్ సంసిద్ధంగా ఉన్నారని ఉరిక్ డెమ్మెర్ పేర్కొన్నారు. తాజా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న దృష్ట్యా లాక్డౌన్కు కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు.
గత ఏడాది నవంబర్ నుంచి జర్మనీలో లాక్డౌన్ తరహా నియంత్రణలు అమల్లో ఉన్నా గత కొద్ది వారాలుగా బ్రిటన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం సంక్లిష్టంగా మారింది. మార్చిలో మెర్కెల్ సహా పదహారు రాష్ట్రాల నేతలు పాల్గొన్న సమావేశంలో వైరస్ను కట్టడి చేసేందుకు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన షట్డౌన్లు, కర్ఫ్యూ విధించాలనే అభిప్రాయం వెల్లడైంది. మరోవైపు కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేలా ఇన్ఫెక్షన్ ప్రొటెక్షన్ చట్టాన్ని సవరించేందుకు మెర్కెల్ సన్నద్ధమయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

