ఇందల్వాయి, డిసెంబర్ 10 : ఇందల్వాయి గ్రామంలోని అంగడి పెరుమాళ్లు ప్రాంతానికి కాస్త దూరంలో చిన్న కొండప్రాంతంలో కాలభైరవ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామస్తులు ఉపాధి హామీ పనుల్లో భాగంగా శుక్రవారం గుట్ట ప్రాంతంలో ముళ్లపొదళ్లను తొలగించే సమయంలో స్వామివారి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిపక్కన చిన్న గుహ మాదిరి నిర్మాణం జరిగి అది పూర్తిగా మూసి ఉన్నది. కాలభైరవ స్వామి ఆలయాలు భారతదేశంలో ఒక కాశీ మరొకటి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇందల్వాయిలో కాలభైరవ స్వామి విగ్రహం బయటపడడంతో ప్రభుత్వం ఆలయం నిర్మించాలని పీఏసీఎస్ చైర్మర్ గోవర్ధన్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ సాయిలు, గ్రామస్తులు కోరుతున్నారు.