Anasuya | నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారారు. ట్రెడిషనల్ నుంచి వెస్ట్రన్ వరకూ ఏ తరహా దుస్తులైనా కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసే అనసూయ, సందర్భానుసారం తన లుక్స్‌ను మార్చుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్లు, టీవీ ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేటప్పుడు చీరలో మెరిసిపోతే, విదేశీ టూర్ల సమయంలో వెస్ట్రన్ డ్రెస్సుల్లో దర్శనమిస్తారు. రీసెంట్గా చీర కట్టుకున్న ఫోటోలను షేర్ చేసిన అనసూయ, న్యూ ఇయర్ సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి బీచ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను షేర్ చేయగా, ఇవి వైరల్ అవుతుంది.
ఎవరు ఎన్ని చెప్పిన కూడా తన పంథా మార్చుకోను అన్న మెస్సేజ్ ఈ రూపంలో అనసూయ ఇచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ పిక్స్‌పై కొందరు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అనసూయ బహిరంగంగా స్పందించడంతో పాటు, శివాజీ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. మహిళలకు క్షమాపణలు చెబుతూ శివాజీ చేసిన ప్రకటనపై అనసూయ ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను కూడా హీరోయిన్ కావడంతో మహిళల అంశాలపై స్పందించడం సహజమేనని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే అనసూయ స్విమ్‌సూట్ వీడియోను మళ్లీ షేర్ చేసింది. దాని వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. చీర ఫోటోలు, స్విమ్‌సూట్ వీడియో—రెండింటికీ వచ్చిన కామెంట్స్‌ను పోల్చిచూపాలన్న ఆలోచన ఉందా? ఏ దుస్తులు ధరించినా మహిళలపై కొందరు చేసే వ్యాఖ్యల తీరు మారదని చెప్పాలనుకున్నారా? లేక ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన రీషేర్ మాత్రమేనా? అనే అంశాలు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. ఏది ఏమైనా, అనసూయ వేసిన ఒక్క పోస్ట్ మరోసారి మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ట్రోలింగ్ వంటి అంశాలపై విస్తృత చర్చకు దారి తీస్తోంది.