చెన్నై : తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సముద్ర ఆహార యూనిట్లో అమోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళలు చనిపోయారు. 67 మందికి పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తిరువల్లూర్ జిల్లాలోని పెరియపాలెంకు దగ్గర్లో ఉన్న ఎస్టీ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్లోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను స్థానిక దవాఖానలకు తరలించాయి. అప్పటికే ఏడుగురు తీవ్ర అస్వస్థతతో చనిపోయారని కలెక్టర్ కవిత తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారిని స్టాన్లే మెడికల్ కాలేజీకి తరలించామన్నారు.