Amazon layoffs | అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్ : ఏడబ్ల్యూఎస్, హెచ్ఆర్ ఉద్యోగులే టార్గెట్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon layoffs) మాస్ లేఆఫ్స్ ఉద్యోగులను వణికిస్తున్నాయి. రెండో దశ లేఆఫ్స్‌ను గత నెలలో ప్రకటించిన అమెజాన్ ఈ దిశగా పలు విభాగాలకు చెందిన 9000 మంది ఉద్యోగులను తొలగించనుంది.
న్యూయార్క్ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon layoffs) మాస్ లేఆఫ్స్ ఉద్యోగులను వణికిస్తున్నాయి. రెండో దశ లేఆఫ్స్‌ను గత నెలలో ప్రకటించిన అమెజాన్ ఈ దిశగా పలు విభాగాలకు చెందిన 9000 మంది ఉద్యోగులను తొలగించనుంది. తాజా లేఆఫ్స్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), హెచ్ఆర్ ఉద్యోగులపై వేటు వేయనుంది.
అమెరికా, కెనడా, కోస్టారికా సహా ప్రపంచవ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ ఉద్యోగులపై తాజా లేఆఫ్స్ ప్రభావం చూపనున్నాయి. ఈరోజు మన సంస్ధలో సంక్లిష్టమైన రోజని లేఆఫ్స్ గురించి ఉద్యోగులకు పంపిన మెమోలో ఏడబ్ల్యూఎస్ సీఈవో ఆడం సెలిస్కీ, హెచ్ఆర్ హెడ్ బెత్ గలెట్టి పేర్కొన్నారు. లేఆఫ్స్‌తో ప్రభావితమైన ఉద్యోగులందరికీ నోటిఫికేషన్ మెసేజ్‌లు పంపామని సీఈవో ఆడం సెలిస్కీ తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్‌తో పాటు లేఆఫ్స్‌తో కొలువులు కోల్పోయిన ఉద్యోగులందరికీ పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని మెమోలో స్పష్టం చేశారు.
గత ఏడాది నవంబర్‌లో 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ ప్రకటించిన అనంతరం మార్చిలో సీఈవో అండీ జస్సీ 9000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 18న అడ్వర్టైజింగ్ యూనిట్‌కు చెందిన పలువురు ఉద్యోగులను అమెజాన్ సాగనంపింది. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో అమెజాన్ పలు ప్రాజెక్టులను నిలిపివేయడం, హైరింగ్‌ను కుదించడంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతోంది.
Read More
Toys park | దండు మల్కాపూర్‌లో టాయ్స్ పార్క్.. 100 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Amazon
- AWS
- Business news
- layoffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

