Nagarjuna | అక్కినేని కుటుంబం నుండి మరో శుభవార్త రాబోతోందా? అక్కినేని అఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడా? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై తాజాగా నాగార్జున స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున రెండో తనయుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం ఈ జంట పలు వెకేషన్ ట్రిప్స్‌కు వెళ్లుతూ ఎయిర్‌పోర్ట్‌లలో మీడియా కంటపడింది. అప్పటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇక ఇదిలా ఉండగా… కొన్ని రోజులుగా జైనబ్ రవ్జీ ప్రెగ్నెంట్ అని, అఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అఖిల్ గానీ, అక్కినేని ఫ్యామిలీ గానీ ఎలాంటి అధికారికంగా స్పందించింది లేదు. దీంతో ఈ ప్రచారం నిజమేనా? లేక కేవలం రూమరేనా? అన్న సందేహాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి నాగార్జునను ప్రశ్నిస్తూ ..“మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారా? సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయి… అవి నిజమేనా?” అని అడిగారు.
దీనికి నాగార్జున నవ్వుతూ స్పందించారు. “సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకే తెలియజేస్తాను” అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆ వార్తలను నేరుగా ఖండించకుండా, టైం వచ్చినప్పుడు చెబుతానని నాగార్జున చెప్పడం ఇప్పుడు రూమర్స్‌కు మరింత బలం చేకూర్చిందనే చెప్పాలి. దీంతో నిజంగానే అఖిల్ తండ్రి కాబోతున్నాడా? అక్కినేని కుటుంబంలో మరోసారి ఆనందపు ఘడియలు రాబోతున్నాయా? అనే చర్చలు సోషల్ మీడియాలో మరింత హాట్‌గా మారాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. నాగార్జున చెప్పినట్టుగా “సరైన సమయం” ఎప్పుడొస్తుందో చూడాలి. అప్పటివరకు అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.