Akhilesh Yadav | అధికారాన్ని నిలుపుకునేందుకే ప్యాకేజీలు: అఖిలేశ్ యాదవ్
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
- బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే ప్రాధాన్యం
- ఆ పార్టీలను మెప్పించడానికే ప్రయత్నం
- బడ్జెట్ తీరుపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
- పార్లమెంటులో విపక్ష ఎంపీల ఆందోళన
- ఉభయసభల నుంచి వాకౌట్ చేసిన సభ్యులు
- ‘ఎన్డీఏ బడ్జెట్ వద్దు.. ఇండియా బడ్జెట్ కావాలి’
- ప్లకార్డులు ప్రదర్శించిన పార్లమెంటు సభ్యులు
Akhilesh Yadav | న్యూఢిల్లీ, జూలై 24: మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు మకర్ ద్వార్ వద్ద నిరసన తెలిపారు. అఖిలేశ్ యాదవ్‌తో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో పలు రాష్ర్టాలకు ప్రాధాన్యత దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ర్టానికి దక్కిందేమీ లేదని పేర్కొన్నారు. లక్నోవాళ్లు(సీఎం యోగిని ఉద్దేశించి) ఢిల్లీవారికి ఆగ్రహం తెప్పించారని, ఇది బడ్జెట్లో కనిపించిందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ఇంటర్న్‌షిప్ పథకంపై ఆయన స్పందిస్తూ.. పదేండ్లుగా యువతను నిరుద్యోగులుగా మార్చి ఇప్పుడు రూ.5,000 జీతం వచ్చే ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
సమాఖ్య స్ఫూర్తిపై దాడి
కేంద్ర బడ్జెట్లో విపక్షపాలిత రాష్ర్టాలపై వివక్ష చూపించడం భారతదేశ సమాఖ్య స్ఫూర్తిపై దాడిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంపై ఆశతో దేశంలోని ఇతర రాష్ర్టాలను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని, వివక్ష చూపించిందని పేర్కొన్నారు. అన్ని రాష్ర్టాలకు సమాన న్యాయం జరగాలని ఇండియా కూటమి గొంతు వినిపిస్తుందని అన్నారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, ఎవరికీ దీని వల్ల న్యాయం జరగలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాగా, బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షను నిరసిస్తూ ఉభయసభల నుంచి ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ‘ఎన్డీఏ బడ్జెట్ వద్దు.. ఇండియా బడ్జెట్ కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

