Akhanda 2 Success Meet | గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ 2 తాండవం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి భారీ టాక్‌తో దూసుకుపోతుండగా… ఈ విజయం పట్ల బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఘనంగా ‘అఖండ 2’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించిన చిత్ర బృందం… ఇప్పుడు ఆ ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ పంచుకోవడానికి సిద్ధమైంది. ఏపీ రాజధాని అమరావతిలో ‘అఖండ 2 తాండవం’ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ నెల 18వ తేదీన (గురువారం) అమరావతిలో ‘అఖండ 2 తాండవం’ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సనాతన ధర్మం నేపథ్యంతో రూపొందిన సినిమా కావడంతో… ఏపీ ప్రభుత్వంలోని కీలక నేతలు కూడా ఈ సక్సెస్ మీట్‌కు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తే బావుంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ‘అఖండ 2 తాండవం’కు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా… మొదటి రోజే దాదాపు 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఆ తర్వాత కూడా వసూళ్లు బాగానే కొనసాగాయి.
వీకెండ్ అనంతరం కొంత మేర కలెక్షన్లు తగ్గినప్పటికీ… ఇది సాధారణ ప్రక్రియేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వసూళ్లు తగ్గడం ఏ సినిమాకైనా సహజమే కావడంతో, దీనిపై పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ఆదరణ కొనసాగుతోంది. సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాల తర్వాత ‘అఖండ 2 తాండవం’తో బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈ కాంబో డబుల్ హ్యాట్రిక్ విజయాలకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఇక ఈ విజయం తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేయబోయే తదుపరి సినిమా ‘జై అఖండ’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.